భోపాల్: భార్య ప్రైవేట్ వీడియోను భర్త లీక్ చేశాడు. సోషల్ మీడియాతోపాటు బంధువులకు షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు. (Husband arrested) మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2025 మే 10న ఒక మహిళకు శివం సాహుతో పెళ్లి జరిగింది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం డిమాండ్ చేయగా వధువు కుటుంబం రూ.2 లక్షలు ఇచ్చింది.
కాగా, మిగతా డబ్బు కోసం శివం సాహు, అతడి కుటుంబం కలిసి ఆ మహిళను వేధించారు. గత ఏడాది డిసెంబర్లో భార్య ప్రైవేట్ వీడియోను భర్త రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాతో పాటు బంధువులకు దానిని షేర్ చేశాడు. భార్య, ఆమె కుటుంబం పరువు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శివం సాహు ముంబైకి పారిపోయాడు.
మరోవైపు, ఫిబ్రవరి 12న మౌగంజ్ ప్రాంతంలోని అత్తమామల ఇంటికి శివం సాహు వచ్చాడు. ఆయుధంతో వారిని బెదిరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని అతడ్ని అరెస్ట్ చేశారు. వరకట్న వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, ప్రైవేట్ కంటెంట్ షేర్ చేయడం వంటి సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Appears Exam With Baby | పది రోజుల బిడ్డతో.. 12వ తరగతి పరీక్షకు హాజరైన యువతి
lose eyesight | సర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది.. ఆసుపత్రి మూసివేత
Electricity, Water Supply Cut | దళిత వాడలో విద్యుత్, తాగునీటి సరఫరా బంద్.. కుల వివక్షపై ఆరోపణలు
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్