భువనేశ్వర్: ఒక గ్రామంలోని దళిత వాడలో విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతవాసులు నిరసన తెలిపారు. తమపై కుల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (Electricity, Water Supply Cut) ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంటాబాంజి ప్రాంతంలోని దళిత వాడకు కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వీధి లైట్లకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు.
కాగా, దళిత ప్రాంతవాసులు దీనిపై నిరసన తెలిపారు. తాము అంధకారంలో నివసిస్తున్నామని, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కాంటాబాంజి ప్రాంత తహసీల్దార్ దీనిపై స్పందించారు. దళిత వాడకు ఒక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని, వీధి లైట్లు వెలిగేలా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్
Villagers Protest | క్వారీ సర్వేపై గ్రామస్తుల నిరసన.. అధికారులపై రాళ్ల దాడి
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?