లక్నో: శస్త్రచికిత్స తర్వాత కొందరి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో 9 మంది చూపుకోల్పోయారు. దీనిపై అధికారులు స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రికి సీల్ వేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. (lose eyesight) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. న్యూ రాజేష్ హై-టెక్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 1న కంటి శిబిరం నిర్వహించారు. ఆ రోజు సుమారు 30 మంది కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.
కాగా, కొన్ని రోజుల్లోనే 18 మంది కళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చాయి. వారిలో తొమ్మిది మంది కంటి చూపు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, లక్నో, వారణాసిలోని సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులకు పలువురిని తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఆ ప్రైవేట్ ఆసుపత్రిని ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నేత్ర వైద్య విభాగాన్ని సీజ్ చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నివేదిక అందిన తర్వాత సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా దోషిగా తేలితే, వారి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని వెల్లడించారు.
Also Read:
Electricity, Water Supply Cut | దళిత వాడలో విద్యుత్, తాగునీటి సరఫరా బంద్.. కుల వివక్షపై ఆరోపణలు
students slit hands | బ్లేడ్‌తో చేతులపై కోసుకున్న 35 మంది విద్యార్థులు.. పేరెంట్స్ షాక్
Villagers Protest | క్వారీ సర్వేపై గ్రామస్తుల నిరసన.. అధికారులపై రాళ్ల దాడి