గ్లాస్గో: భారత జావెలిన్ స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా.. కామన్వెల్త్ క్రీడల్లో(Commonwealth Games) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్లో మరో ఇండియన్ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన చివరి త్రోతో యశ్వీర్ అనూహ్య రీతిలో మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన 28 ఏళ్ల నీరజ్ చోప్రా .. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో అటెంప్ట్‌లో 85.83 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ పాక్ అథ్లెట్ అనుకోని రీతిలో నిష్క్రమించాడు. ఇటీవల వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక అథ్లెట్ రుమేశ్ తరంగ పతిరగే సత్తా చాటాడు. అతను జావెలిన్‌ను 89.75 మీటర్ల దూరం విసిరి బంగారం పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
గ్లాస్గోలో ప్రస్తుతం చల్లని వాతావరణం ఉన్నది. బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో జావెలిన్‌ను సుమారు 90 మీటర్ల దూరం వరకు విసరడం అంత సులువైన అంశం కాదు. ఈ సీజన్లో జావెలిన్‌ను 90 మీటర్ల మార్క్ దాటించిన ఏకైక క్రీడాకారుడి జాబితాలో రుమేశ్ తరంగ ఉన్నాడు. ఇక ఈవెంట్లో 24 ఏళ్ల యశ్వీర్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతున్న అతను.. అందర్నీ స్టన్ చేస్తూ తన జావెలిన్‌ను 85.41 మీటర్ల దూరం విసిరాడు. తన చివరి ఆరో ప్రయత్నంలో అతను ఆ దూరానికి జావెలిన్‌ను విసిరి ఇండియాకు పతకాల సంఖ్యను పెంచేశాడు.