చెన్నై: తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని విస్తరించారు. గాంధీ జయంతి సందర్భంగా ‘వెట్రి పయనం’ పథకాన్ని ఇవాళ సీఎం విజయ్(CM Vijay) ప్రారంభించారు. ఉచిత బస్సు స్కీమ్ ద్వారా సుమారు 84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. డీలక్స్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల్లోనూ ఇక నుంచి మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆదాయంతో సంబంధం లేకుండా లబ్ధిదారులు ఉచిత సర్వీసులను వినియోగించుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. డైలీ ట్రిప్లపై కూడా ఎటువంటి ఆంక్షలు ఉండబోవని ప్రభుత్వం వెల్లడించింది. వెట్రి పయనం సంక్షేమ పథకం పేరును విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం పార్టీ నుంచి పెట్టారు. వెట్రి పయనం అంటే విజయవంతమైన ప్రయాణం అని అర్థం వస్తుంది. ఇది మహిళల విజయం అన్న రీతిలో విజయ్ సర్కారు వివరణ ఇచ్చింది.
తమిళనాడులో ఉన్న ఏడు రాష్ట్ర రవాణా సంస్థలకు చెందిన 12,695 బస్సులకు ఈ స్కీమ్ వర్తించనున్నది. ప్రతి రోజు దాదాపు 84 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులతో సీఎం విజయ్ మాట్లాడారు. అధికారికంగా స్కీమ్‌ను ప్రకటించే నేపథ్యంలో ఆయన కండెక్టర్లా మారి బస్సులోని మహిళలకు టికెట్లు కూడా ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి ఏ విజయ్ తమిళన్ పార్తిబన్ మాట్లాడుతూ.. మహిళలు, ట్రాన్స్జెండర్ల విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక సాధికారత కోసం ఉచిత బస్సు జర్నీ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల ప్రగతికి రవాణా ఖర్చులు నిరోధం కాబోదన్నారు.
రవాణా హక్కుల్లో బేధాలు ఉండకూడాదని, సమానత్వం ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ స్కీమ్‌ను సామాజిక విప్లవంతో ఆయన పోల్చారు. మహిళలు వ్యక్తిగతంగా ఆలోచించి, ఇంటి నుంచి బయటకు వచ్చి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని ఆయన అన్నారు. గతంలో ఉచిత బస్సు స్కీమ్‌ను కొన్ని ప్రత్యేక బస్సులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ స్కీమ్‌ను మరిన్ని కేటగిరీలకు విస్తరించారు. ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, మఫిసిల్ ఆర్డినరీ, ఘాట్ ఏరియా సర్వీసులకు ఇప్పుడు ఉచిత పథకం వర్తించనున్నది.
CUTE VIDEO 😅
CM Vijay is personally handing out tickets to women on bus ♥️ pic.twitter.com/4xbwx8ZKlZ
— Ayyappan (@Ayyappan_1504) October 2, 2026