New Delhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మరింత ఆందోళన జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా జంతర్ మంతర్‌తోపాటు న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
ఎన్నికల నిర్వహణ, సర్ ప్రక్రియలో అవకతవకల విషయంలో చర్యలు తీసుకోవాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు, ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిరసన చేపట్టాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ ఆందోళనలో సీజేపీ పాల్గొనడం లేదు. గతంలో సీజేపీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళన ఎంత హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
అందుకే, ఈసారి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో భద్రతా బలగాల్ని మోహరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జంతర్‌మంతర్ మార్గంలో ప్రయాణించే 11 మెట్రో రేల్వే స్టేషన్లను మూసివేశారు. జంతర్‌మంతర్‌కు దారితీసే అనేక మార్గాల్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతానికి వాహనాలు రాకపోవడంతో పలువురు ఆందోళనకారులు నడుచుకుంటూనే ఇక్కడికి చేరుకున్నారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా కోరింది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు.