న్యూఢిల్లీ: మహా శివరాత్రి రోజున ఒక మహిళ వినూత్నంగా పూజలు చేసింది. భర్తను మెడ వరకు నేలలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత శివలింగం మాదిరిగా భర్త తలపై పూలు, పాలతో అభిషేకం చేసింది. (Woman Buries Husband, Performs Pooja) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహా శివరాత్రి సందర్భంగా ఒక మహిళ తన భర్త తలను శివలింగంగా మార్చింది. అతడ్ని మెడ వరకు నేలలో పూడ్చిపెట్టింది. భర్త తలను శివలింగంగా భావించింది. పూలతో పూజించింది. పాలతో అభిషేకం చేసింది. ‘హరహర మహాదేవ్’ అంటూ శివుడి మంత్రాలు జపించింది. భర్త తలకు నమస్కరించింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. రీల్ కోసం ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అయితే గిరిజన మహిళలు సంప్రదాయంగా ఇలాంటి ఆచారాలు ఆచరిస్తారని మరికొందరు పేర్కొన్నారు.
“Har Har Mahadev.” 🙏🤣
But what happened to this uncle? Why did aunty buried him in the ground and chanting “Har Har Mahadev” for some magic?
It really makes me laugh and wonder why people do such things. Sheer stupidity. pic.twitter.com/KQKUE46LO3
— Mission Ambedkar (@MissionAmbedkar) February 16, 2026
Also Read:
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Fights Off Bear | ఎలుగుబంటితో పోరాడి.. భర్తను కాపాడిన భార్య
Indore Woman Murder | ‘ఏది జరుగాలో అది జరిగింది’.. ప్రియురాలి హత్యపై నవ్వుతూ నిందితుడు