భువనేశ్వర్: భార్యాభర్తలు ఆకుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లారు. ఒక ఎలుగుబంటి భర్తపై దాడి చేసింది. అయితే పక్కనే ఉన్న భార్య భయంతో పారిపోలేదు. చేతిలోని ఆయుధంతో ఎలుగుబంటితో పోరాడింది. ప్రాణాలకు తెగించి భర్తను కాపాడింది. (Woman Fights Off Bear) గాయపడిన ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 17న మిలూ గ్రామానికి చెందిన మాల్డే సోరెన్, అతడి భార్య లిలి సోరెన్ కలిసి ఆకులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లారు.
కాగా, ఆరు ఎలుగుబంట్ల గుంపు వారికి ఎదురైంది. ఒక ఎలుగుబంటి మాల్డేపై దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పక్కనే ఉన్న భార్య లిలి వెంటనే అప్రమత్తమైంది. ఏమాత్రం భయపడకుండా చేతిలో ఉన్న గొడ్డలితో ఎలుగుబంటిపై పోరాడింది. దాని బారి నుంచి భర్తను కాపాడింది. గాయపడిన ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది.
మరోవైపు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త మాల్డేను తొలుత స్థానిక ఆసుపత్రికి భార్య తీసుకెళ్లింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కియోంఝర్ జిల్లాలోని ఆసుపత్రికి అతడ్ని తరలించారు. స్థానిక అటవీశాఖ అధికారి ఈ సంఘటనను ధృవీకరించారు.
Also Read:
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?
Indore Woman Murder | ‘ఏది జరుగాలో అది జరిగింది’.. ప్రియురాలి హత్యపై నవ్వుతూ నిందితుడు
Boy Kills Aunt | మేనత్తను హత్య చేసిన మేనల్లుడు.. సోఫా కమ్ బెడ్లో మృతదేహం