భోపాల్: ప్రియురాలి హత్యపై నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు. పైగా ఏది జరుగాలో అది జరిగిందని నవ్వుతూ అన్నాడు. హత్య ఎందుకు చేశావని మీడియా అడగ్గా.. తెలుసుకోవడం ద్వారా మీరు ఏమి చేస్తారని ఎదురు పశ్నించాడు. (Indore Woman Murder) సమయం వచ్చినప్పుడు ప్రతిదీ వెల్లడిస్తానని చెప్పాడు. ఫిబ్రవరి 13న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ద్వారకపూరి ప్రాంతంలోని ఒక అద్దె ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని డోర్ పగులగొట్టి లోపలకు వెళ్లి చూశారు. బెడ్‌పై మహిళ నగ్న మృతదేహాన్ని కనుగొన్నారు.
కాగా, ఆ అద్దె ఇంట్లో నివసించే పియూష్ ధమ్నోటియా తన ప్రియురాలైన 24 ఏళ్ల మహిళను ఫిబ్రవరి 10న తన రూమ్‌కు తీసుకువచ్చాడు. లైంగికంగా కలిసిన తర్వాత పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. అరవకుండా నోటిని టేప్‌తో మూశాడు. ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశాడు.
మరోవైపు ప్రియురాలి హత్య తర్వాత మహారాష్ట్రలోని పన్వేల్‌కు పియూష్ పారిపోయాడు. హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆత్మలను పిలిచే వీడియోలను యూట్యూబ్‌లో చూశాడు. ప్రియురాలి ఆత్మతో మాట్లాడేందుకు ఆ విధంగా ప్రయత్నించాడు.

Indore Woman Murder
అయితే నిందితుడు పియూష్ మహారాష్ట్రలో ఉన్నట్లు ఇండోర్ పోలీసులు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి అతడ్ని అరెస్ట్ చేసి ఇండోర్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో అతడు మాట్లాడాడు. ఏది జరుగాలో అది జరిగిందని నవ్వుతూ అన్నాడు. హత్య ఎందుకు చేశావని మీడియా అడగ్గా.. తెలుసుకోవడం ద్వారా మీరు ఏమి చేస్తారని ఎదురు పశ్నించాడు. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ వెల్లడిస్తానని చెప్పాడు.
కాగా, ప్రియురాలు ఇతర పురుషులతో మాట్లాడినప్పుడల్లా నిందితుడు అభద్రతా భావంతో ఉన్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. మానసికంగా బాధపడుతున్నట్లు అతడి ప్రవర్తన ద్వారా తెలుస్తున్నదని అన్నారు. అన్ని ఆధారాలు పరిశీలించి ఈ కేసుపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
The horrific murder of a young woman in Indore by Piyush Dhamnotiya, strangling her for refusing intimacy, stabbing her, assaulting her lifeless body, & performing occult rituals, exposes the depths of depravity in our society.
This MBA student, a supposed educated man,… pic.twitter.com/RRhTth3SWt
— Sachin Singh (@SachSynapse) February 18, 2026
Also Read:
Boy Kills Aunt | మేనత్తను హత్య చేసిన మేనల్లుడు.. సోఫా కమ్ బెడ్లో మృతదేహం
Watch: ప్రారంభించక ముందే పగుళ్లు.. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్