లక్నో: కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభానికి ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం నింపిన నీరు ఆ ట్యాంక్ నుంచి లీకైంది. దీంతో అది ఎప్పుడైనా కూలవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. (Water tank leaks) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. మహోబా జిల్లాలోని నాగరాదంగ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద 2.05 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించారు.
కాగా, రూ.65 లక్షలకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రారంభించక ముందే పగుళ్లిచ్చింది. టెస్టింగ్ కోసం పూర్తి సామర్థ్యంతో నీటిని నింపగా పగుళ్ల నుంచి నీరు ధారగా కారింది. దీంతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణ నాణ్యత, అవినీతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎప్పుడైనా కూలవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దీనిపై స్పందించింది. ‘అవినీతి బీజేపీ ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంక్ పరీక్షించిన ఒక రోజు తర్వాత జలపాతంలా ప్రవహించడం ప్రారంభించింది. దీని నిర్మాణానికి రూ. 65 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అయినప్పటికీ అది ఒక్క రోజు కూడా నిలువలేదు. మోదీ ప్రభుత్వ అవినీతికి ఈ ట్యాంక్ నిర్మాణం ఒక ఉదాహరణ’ అని ఆరోపించింది.
In Mahoba, Uttar Pradesh, a ₹65 lakh overhead water tank built under the Jal Jeevan Mission began leaking heavily within a day of its test run on 13 February. Constructed to supply drinking water to nearby households in Bundelkhand, the structure started gushing water from its… pic.twitter.com/HLFO90uSLz
— Dr Syed Naseer Hussain, M P (@NasirHussainINC) February 16, 2026
Also Read:
Nainar Nagendran | త్రిషా వార్నింగ్తో దిగివచ్చిన తమిళనాడు బీజేపీ చీఫ్.. తన వ్యాఖ్యలపై క్షమాపణ
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్కు భూపేన్ బోరా రాజీనామా!.. కొన్ని గంటల్లోనే యూటర్న్
Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?