హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతులను విస్తరించాలని ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, వెడ్మబొజ్జు, పాయల్ శంకర్, డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసుపత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని వైద్య విభాగాలను బలోపేతం చేయాలని సూచించారు.