చెన్నై: తమిళ నటి త్రిషా వార్నింగ్‌తో పాటు, విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) దిగివచ్చారు. త్రిషాపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. పోరపాటు వల్ల తాను అలా అన్నట్లు వివరణ ఇచ్చారు. ‘ఇది పొరపాటున చేసిన ప్రకటన. అఖిల భారత మహిళా విభాగం చీఫ్ వానతి శ్రీనివాసన్, అన్నామలై ఈ విషయం గురించి నాతో మాట్లాడారు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, నేను నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఒక సభలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ను తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ లక్ష్యంగా చేసుకున్నారు. విజయ్‌కు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదని, ఆయన కేవలం సినిమాల్లో డ్యాన్సులు వేసుకోవడానికే పరిమితమని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. ‘ఆయన (విజయ్) పూర్తిగా అనుభవం లేనివాడు. ముందు తన ఇంచి నుంచి ఆయన బయటకు రావాలి. ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రా, అప్పుడు ఏదైనా జరుగుతుంది’ అని నవ్వుతూ అన్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర చీఫ్ నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. నటి త్రిషా కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇంత అసహ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు సంబంధం లేని విషయాల్లోకి నా పేరు లాగవద్దు. లేకపోతే పరువునష్టం దావా వేయాల్సి ఉంటుంది’ అని త్రిషా హెచ్చరించారు. ఆమె తరుఫు న్యాయ సలహాదారులు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read:
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్‌కు భూపేన్ బోరా రాజీనామా!.. కొన్ని గంటల్లోనే యూటర్న్
Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
Watch: కదులుతున్న కారుపై కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి