డెహ్రాడూన్: ఒక పెద్ద పులి గుర్రంపై దాడి చేసింది. దానిని నోటకరుచుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. సఫారీకి వెళ్లిన టూరిస్టులు ఇది చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Tiger Drags Horse) ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ సమీపంలో ఉన్న గర్జియా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన జిమ్ కార్బెట్ పార్క్‌లో సఫారీ కోసం కొందరు పర్యాటకులు వాహనాల్లో వెళ్లారు. ఈ జాతీయ పార్కులో సుమారు 260కుపైగా బెంగాల్ పులులు ఉన్నట్లు అంచనా.
కాగా, ఒక చెట్టు వద్ద కూర్చొన్న గుర్రంపై ఒక పెద్ద పులి దాడి చేసింది. దానిని నోటకరుచుకుని సమీపంలోని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. సఫారీ జీపుల్లో ఉన్న టూరిస్టులు ఇది చూసి షాక్ అయ్యారు. భయాందోళనతో కేకలు వేశారు. ఒకరు రికార్డ్ చేసిన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
TIGER ATTACKS HORSE IN GARJIYA
This may be disturbing to watch, but a massive tiger dragged away a horse in front of tourists. Garjiya zone near Ramnagar is in Corbett park, but this area is also famous for the temple, which many visit. This attack was in the afternoon, near an… pic.twitter.com/7NwYAzL2wk— Gargi Rawat (@GargiRawat) August 19, 2026