బెంగళూరు: విదేశీ పర్యాటకురాలితోపాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం, ఒక వ్యక్తి హత్య కేసులో సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతోపాటు మరణశిక్ష విధించింది. (Death penalty for three) కర్ణాటకలోని గంగావతి జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు ఫిబ్రవరి 6న ముగ్గురు నిందితులైన మల్లేష్ అలియాస్ హాండిమాల్, సాయి, శరణప్పలను దోషులుగా నిర్ధారించింది. సోమవారం న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ముగ్గురికి మరణ శిక్ష ఖరారు చేశారు. ఈ నేరం అత్యంత అరుదైన కేసు కిందకు వస్తుందని అందుకే గరిష్ట శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
కాగా, 2025 మార్చి 6న హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలోని సనాపూర్ సరస్సు వద్దకు పర్యాటకుల బృందం చేరుకున్నది. 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ, 29 ఏళ్ల హోమ్‌స్టే యజమానురాలు, అమెరికా, ఒడిశా, మహారాష్ట్రలకు చెందిన ముగ్గురు పురుషులు ఆ బృందంలో ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత తుంగభద్ర కాలువ ఒడ్డున కూర్చుని గిటార్ వాయిస్తూ సంగీతాన్ని ఆస్వాదించారు.
మరోవైపు ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడకు చేరుకున్నారు. టూరిస్ట్ బృందాన్ని డబ్బులు డిమాండ్ చేశారు. ముగ్గురు పురుషులపై దాడి చేశారు. వారిని కాలువలోకి తోశారు. ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి మొబైల్ ఫోన్స్, నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
అయితే కాలువలో పడిన ఇద్దరు పురుషులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో వ్యక్తి నీటిలో మునిగి మరణించాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల్లోనే మల్లేష్ అలియాస్ హాండిమాల్, సాయి, శరణప్పలను అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన సెషన్స్ కోర్టు 11 నెలల్లోనే వారిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది.
Also Read:
Nainar Nagendran | త్రిషా వార్నింగ్‌తో దిగివచ్చిన తమిళనాడు బీజేపీ చీఫ్.. తన వ్యాఖ్యలపై క్షమాపణ
Bhupen Borah | అస్సాం కాంగ్రెస్‌కు భూపేన్ బోరా రాజీనామా!.. కొన్ని గంటల్లోనే యూటర్న్
Watch: ఇంటిపైన బాంబులు తయారు చేస్తుండగా పేలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి