సన్‌స్క్రీన్ స్ప్రే చేస్తున్నారా..!
ఎండాకాలమనే కాదు అన్ని రోజుల్లోనూ సన్‌స్క్రీన్‌ను వాడుతున్నారు నేటి తరం అమ్మాయిలు. అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుకోవటం సహా చర్మం ట్యాన్ అవ్వకుండా ఉండేందుకు, పిగ్మెంటేషన్‌ను అరికట్టేందుకు అంటూ ఇవి వాడేందుకు ఎవరి కారణాలు వారికి ఉంటున్నాయి. అందులోనూ ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటున్నది.
ఎండాకాలమనే కాదు అన్ని రోజుల్లోనూ సన్‌స్క్రీన్‌ను వాడుతున్నారు నేటి తరం అమ్మాయిలు. అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుకోవటం సహా చర్మం ట్యాన్ అవ్వకుండా ఉండేందుకు, పిగ్మెంటేషన్‌ను అరికట్టేందుకు అంటూ ఇవి వాడేందుకు ఎవరి కారణాలు వారికి ఉంటున్నాయి. అందులోనూ ఇటీవల కాలంతో సంబంధం లేకుండా ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటున్నది. అయితే ఇప్పటి దాకా క్రీమ్ లేదా లోషన్ల రూపంలోనే వీటిని వినియోగం ఎక్కువగా ఉంది. కానీ దీన్ని మరింత సమర్థంగా వినియోగించుకునేలా ‘స్ప్రే సన్‌స్క్రీన్’లు తయారవుతున్నాయి. రోజ్ వాటర్లాంటివి స్ప్రే చేసినట్టే దీన్నీ స్ప్రే చేసుకోవచ్చు. లోషన్లతో పోలిస్తే పల్చగా ఉండే ఇవి శరీరం మీద సమంగా పరచుకుంటాయి. దాని వల్ల చర్మానికి మరింత రక్షణ లభిస్తుంది. అలాగే బయటికి వెళ్లినప్పుడూ సులభంగా ఐప్లె చేసుకోవచ్చు.
అయితే ఈ రకం సన్స్క్రీన్లను సక్రమంగా వినియోగించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి స్ప్రే చేస్తే చర్మం మీద ఇది చాలా పల్చటి పొరను ఏర్పరుస్తుంది. అందువల్ల అనుకున్నంత రక్షణ రాకపోవచ్చు. అందుకే కేవలం తడి అవ్వగానే వదిలేయకుండా చర్మం మీద గాజు పొరలా సన్‌స్క్రీన్ మెరిసేంత వరకూ దీన్ని చల్లాలి. ఆ తర్వాత బాగా ఇంకేలా నెమ్మదిగా మర్దనా చేయాలి. అలాగే శరీరం మీద చేసినట్టు ముఖం మీద నేరుగా స్ప్రే చేయకూడదు. అరచేతిలో వేసుకుని రాసుకోవడమే మంచి పద్ధతి. దాని వల్ల సన్‌స్క్రీన్ ముక్కు, కళ్లను ప్రభావితం చేయకుండా ఉంటుంది. ఇక, గాలి ఎక్కువగా వీచే ఆరుబయట కాకుండా, ఏదైనా గదిలాంటి దానిలో కూర్చుని రాసుకోవడం వల్ల సన్‌స్క్రీన్ వృథా కాకుండా ఉంటుంది. ఇక, రక్షణ విషయంలో క్రీములకు ఇవేం తీసిపోవని చర్మ సంరక్షణా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇక సన్‌స్క్రీన్ రాసుకోవడం మరింత తేలికైనట్టే!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

