భారతీయుల్లో ఎక్కువమంది తమ ఆర్థిక వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం లేదట. ఫలితంగా.. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లలో రూ.80,000 కోట్లకు పైగా సొమ్ము క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నదట. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన వివరాలు తెలియకపోవడం వల్ల.. వాటిని క్లెయిమ్ చేయడం లేదట. దీనిని అధిగమించాలంటే.. అన్నిరకాల ఆర్థిక విషయాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సలహాలను అందిస్తున్నారు.