బోనాల ఉత్సవాలపై నీలినీడలు!
బోనాల ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా, చార్మినార్, గోల్కొండ జోన్లు మినహా చాలా జోన్లలో టెండర్లు ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్ నెల నుంచి బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
- డిసెంబర్ నుంచి నిలిచిన నిర్వహణ నిధులు
సిటీబ్యూరో: బోనాల ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా, చార్మినార్, గోల్కొండ జోన్లు మినహా చాలా జోన్లలో టెండర్లు ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్ నెల నుంచి బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలతో పాటు కొత్త పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయకపోతే, ఉత్సవాలకు సంబంధించిన పనులన్నింటినీ నిలిపివేస్తామని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికల్లా తొలుత మార్చి నెల వరకు ఉన్న బిల్లులన్నీ చెల్లిస్తామని అధికారులు చెబుతుంటే.. నెలాఖరు వరకు వేచి చూడటం వల్ల పండుగ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు కాంట్రాక్టర్లు. మొత్తంగా కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు మార్చి నాటి బిల్లుల ప్రాసెసింగ్‌ను వీలైనంత త్వరగా ముగించి వెంటనే నిధులు విడుదల చేస్తారా? ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

