ఒకే ఫ్రేములో ఈ ఇద్దరినీ చూస్తే భలే ముచ్చటగా ఉంది కదా. ఇద్దరూ దేశాధి నేతలే! ఇద్దరూ పాఠాలు చెప్పి పైకెదిగిన వారే. రాజకీయాల్లోకి రాకముందు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగేండ్లపాటు ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఈ ఫొటోలో ఉన్న రెండో నేత సిల్జనోవ్సా. తను ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఓ ప్రొఫెసర్.
న్యాయ శాస్త్ర పాఠాలు చెప్పే సిల్జనోవ్సా రాజకీయాల్లోకి వచ్చాక అనేక బాధ్యతలు నిర్వహించారు. ఓసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ పోటీ చేసి గెలిచారు. ఉత్తర మాసిడోనియా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తూ.. ‘ఉత్తర మాసిడోనియాను ఫెమినిస్ట్, యూరోపియనైజ్డ్ కంట్రీగా మారుస్తాన’ని ప్రకటించారు. ప్రపంచంలో ఏ దేశాధినేతా ఇలాంటి ప్రకటన చేయలేదు. ఆచరణలో సఫలమైతే మంచిదే!