హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేరొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్ఎస్లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్సిక్ ఉద్యోగులకు సోమవారం డీజీపీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నియమితులైన 57 మందిలో 36 మంది పీహెచ్డీ, 15 మంది ఎంటెక్ పట్టభద్రులు ఉండటం సంతోషకర విషయమని పేరొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ.. పరిమిత సిబ్బందితోనే ఫోరెన్సిక్ ల్యాబ్ 80 శాతానికి పైగా కేసులను పరిషరిస్తున్నదని అన్నారు.