న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు (Walkie-Talkie) విక్రయిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) స్వయంగా చర్యలు చేపట్టింది. 13 ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్‌మ్యాన్ టాయ్స్, ట్రేడ్ ఇండియా, ఆంత్రిక్ష్ టెక్నాలజీస్, వర్దాన్మార్ట్, ఇండియామార్ట్, మెటా ప్లాట్‌ఫామ్‌లు ఇంక్. (ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్, కృష్ణ మార్ట్, అమెజాన్ సంస్థలు 16,970కు పైగా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు అమ్మినట్లు సీసీపీఏ గుర్తించింది. ఆయా ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం 2019, టెలికాం చట్టాలను ఉల్లంఘించినట్లు సీసీపీఏ ఆరోపింది. ఎనిమిది సంస్థలకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి రూ.44 లక్షల జరిమానాలు విధించింది
కాగా, మీషో, మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇంక్. (ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై రూ.10 లక్షల చొప్పున, చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్లపై లక్ష చొప్పున జరిమానా విధించినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. మీషో, మెటా, చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో సంస్థలు జరిమానా చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన ప్లాట్‌ఫామ్‌ల నుంచి జరిమానా చెల్లింపులు రావాల్సి ఉన్నదని వెల్లడించారు.
Also Read:
103 Year Old Woman | వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన బంధువులు.. పుట్టిన రోజునే తిరిగి బతికిన ఆమె
Daughter Beaten To Death | దుస్తులు మురికి అయ్యాయని.. కుమార్తెను కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి
Air Hostess Dies By Suicide | ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య.. మాజీ ప్రియుడిపై కేసు