T20 World Cup Super 8 : పొట్టి ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన నాలుగు జట్లు నాకౌట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. టేబుల్ టాపర్స్‌గా గ్రూప్ 1లో చోటు దక్కించుకున్న భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేల మధ్య సూపర్ 8 రసవత్తరంగా ఉండనుంది. రెండో ర్యాంక్‌తో గ్రూప్ 2లో నిలిచిన శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సైతం తగ్గపోరుకు సై అంటున్నాయి. అయితే అందరి కళ్లన్ని గ్రూప్ 1 మీదే. ఎందుకంటే.. కలల కప్ వేటలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే.. మూడో కప్‌ను ముద్దాడాలని టీమిండియా, విండీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ చతుష్టయంలో సెమీస్ గడప తొక్కే రెండు జట్లు ఏవి? అనేది ఆసక్తి రేపుతోంది.
లీగ్ దశలో దూకుడు కనబరిచిన ఎనిమిది జట్లు సూపర్ 8 దాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గ్రూప్ 1లో అన్ని టేబుల్ టాపర్స్.. గ్రూప్ 2లో సెకండ్ ర్యాంకర్స్ ఉండడంతో.. సెమీస్ చేరే జట్లేవో అంచనా వేస్తున్నారు మాజీలు, కామెంటేటర్లు. భారత జట్టుతో మొదలెడితే.. డిఫెండింగ్ ఛాంపియన్ జోరు చూపిస్తూ సూపర్ 8లో అడుగుపెట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మూడు డకౌట్లతో నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్ (నమీబియాపై 61, పాకిస్థాన్‌పై 77) మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు.
𝗪 𝗪 𝗪 𝗪#TeamIndia end the league stage with a 4⃣th consecutive victory ✅
Bring on the Super 8s 💪
Scorecard ▶️ https://t.co/SdXngdnwKB#T20WorldCup | #MenInBlue | #INDvNED️ pic.twitter.com/pgi086F3ls
— BCCI (@BCCI) February 18, 2026
మిడిల్ ఓవర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(యూఎస్ఏపై 84 పరుగులు), శివం దూబే(నమీబియా, నెదర్లాండ్స్‌పై 66 పరుగులు), హార్దిక్ పాండ్యా(నమీబియాపై 52)లు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. బౌలింగ్ యూనిట్లో బుమ్రా.. వరుణ్ చక్రవర్తి (9 వికెట్లు) మాత్రమే వికెట్లతో చెలరేగుతున్నారు. సూపర్ 8 దాటాలంటే.. ఒకరిద్దరు రాణిస్తే సరిపోదు.. సమిష్టిగా ప్రత్యర్థిని దెబ్బకొట్టాల్సి ఉంటుంది.
Due to pre-tournament seedings, Group 1 of the Super Eight stage will have all four teams who topped their first-round groups unbeaten 😳#T20WorldCup pic.twitter.com/m21a60oT4u
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
చోకర్స్ ముద్ర నుంచి బయటపడి డబ్ల్యూటీసీ టైటిల్ కొల్లగొట్టిన దక్షిణాఫ్రికా కూడా టైటిల్‌పై గురి పెట్టింది. గత సీజన్లో టీమిండియా చేతిలో 7 పరుగుల తేడాతో ఓడి.. చేజార్చుకున్న ట్రోఫీని ఒడిసిపట్టేందుకు సఫారీ సైన్యం రెఢీగా ఉంది. అందుకు తగ్గట్టే గ్రూప్ డీలోని మర్క్రమ్ సేన లీగ్ దశను 4-0తో ముగించింది.
Ready For The Next Challenge! 💥#TheProteas charge into the SUPER 8 phase of the #T20WorldCup with momentum, belief, and one goal in sight. 🏆🇿🇦
Every game from here is sharper. Every moment bigger. It’s time to raise the level. 😤#Unbreakable pic.twitter.com/Ky6LB6fNht
— Proteas Men (@ProteasMenCSA) February 18, 2026
సారథిగానే కాదు ఓపెనర్‌గా అదరగొడుతున్న మర్క్రమ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రికెల్టన్, డికాక్, డెవాల్డ్ బ్రెవిస్.. స్టబ్స్, మిల్లర్‌తో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. మార్కో యాన్సెన్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఎంగిడి, కేశవ్ మహరాజ్‌లు జట్టు విజయాల్లో కీలకమవుతున్నారు. సూపర్ 8లోనూ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్న సఫారీలు తొలిసారి పొట్టి కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్నారు.
చిన్న జట్టుగా వరల్డ్‌కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే సంచలన విజయాలతో గ్రూప్ బీ నుంచి నాకౌట్ చేరింది. తొలి పోరులో ఒమన్‌పై విజయంతో ఖాతా తెరిచిన ఆఫ్రికా జట్టు.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వణికించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(64 నాటౌట్) అర్ధ శతకంతో మెరవగా.. పేసర్ బ్లెస్సింగ్ ముజరబని(4-17), ఎవాన్స్(3-23)ల జోరుతో ఆసీస్‌పై 23 పరుగులతో గెలిచి చరిత్ర సృష్టించింది సికిందర్ రజా బృందం.
— Zimbabwe Cricket (@ZimCricketv) February 19, 2026
ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో సూపర్ 8కు దూసుకెళ్లిన జింబాబ్వే.. చివరి లీగ్ మ్యాచ్‌లో తడాఖా చూపింది. బ్లెస్సింగ్ ముజరబని(2-38), ఎవాన్స్(2-35) రాణించగా 179 పరుగుల ఛేదనలో శ్రీలంక స్పిన్ ఉచ్చును ఛేదించింది. బెన్నెట్(63 నాటౌట్), కెప్టెన్ సికిందర్ రజా 26 బంతుల్లోనే 45 రన్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
సన్నాహక సిరీస్‌లో నేపాల్ చేతిలో సిరీస్ ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్ మెగా టోర్నీలో పంజా విసురుతోంది. గ్రూప్ సీ తొలి పోరులో స్కాంట్లాండ్‌పై 35 పరుగులతో, ఇంగ్లండ్‌ను 30 రన్స్ తేడాతో ఓడించిన విండీస్.. నేపాల్‌పై 9 వికెట్ల విజయంతో నాకౌట్ బెర్తు సాధించింది. ఈసారి ఐపీఎల్ స్టార్లు హెట్‌మైర్, రూథర్ఫోర్డులు దంచేస్తుండగా.. కెప్టెన్ షాయ్ హోప్ సైతం కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
Carried by belief.🌴
The dream continues into the Super 8️⃣s.💪🏽#T20WorldCup | #MenInMaroon | #MaroonSpirit pic.twitter.com/Eaj91FKNPt
— Windies Cricket (@windiescricket) February 19, 2026
ఇక సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(7 వికెట్లు) బంతితో చెలరేగుతున్నాడు. సమిష్టిగా రాణిస్తున్న కరీబియన్ జట్టు ఆల్‌రౌండ్ షోతో నాలుగుకు నాలుగు మ్యాచుల్లో గెలిచి దర్జాగా సూపర్ 8లో పాగా వేసింది. ఇదే జోరును నాకౌట్ దశలోనూ చూపిస్తే రెండుసార్లు ( డారెన్ సమీ సారథ్యంలో ) కప్‌ను తన్నుకుపోయిన విండీస్ ఫైనల్ ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
ఫిబ్రవరి 21 – న్యూజిలాండ్ VS పాకిస్థాన్, పల్లెకెలె స్టేడియం, రాత్రి 7 గంటల నుంచి
ఫిబ్రవరి 22 – ఇంగ్లండ్ VS శ్రీలంక, పల్లెకెలె స్టేడియం, మధ్యాహ్నం 3 గంటలకు
భారత్ VS దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్, రాత్రి 7 గంటలకు
ఫిబ్రవరి 23 – జింబాబ్వే VS వెస్టిండీస్ ముంబై వాంఖడే స్టేడియం రాత్రి 7 గంటలకు
ఫిబ్రవరి 24 – ఇంగ్లండ్ VS పాకిస్థాన్ పల్లెకెలె స్టేడియం రాత్రి 7 గంటలకు
ఫిబ్రవరి 25 – న్యూజిలాండ్ VS శ్రీలంక, కొలంబో ప్రేమదాస స్టేడియం, రాత్రి 7 గంటలకు
🚨 ZIMBABWE CREATES HISTORY AND JOINS THE UNBEATEN TEAMS 🚨
Super 8 Group 1 :
India 🇮🇳 – Unbeaten
South Africa 🇿🇦 – Unbeaten
West Indies 🏝️ – Unbeaten
Zimbabwe 🇿🇼 – UnbeatenAll these teams are still unbeaten and will face each other in Super 8 😳pic.twitter.com/gDEP1fuJZm
— Richard Kettleborough (@RichKettle07) February 19, 2026
ఫిబ్రవరి 26 – వెస్టిండీస్ VS దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు
భారత్ VS జింబాబ్వే చిదంబరం స్టేడియం, రాత్రి 7 గంటలకు
ఫిబ్రవరి 27 – ఇంగ్లండ్ VS న్యూజిలాండ్, ప్రేమదాస స్టేడియం, రాత్రి 7 గంటలకు
ఫిబ్రవరి 28 – పాకిస్థాన్ VS శ్రీలంక పల్లెకెల్ స్టేడియం రాత్రి 7 గంటలకు
మార్చి 1 – జింబాబ్వే VS దక్షిణాఫ్రికా, అరుణ్ జైట్లీ స్టేడియం, మధ్యాహ్నం 3 గంటలకు
భారత్ VS వెస్టిండీస్, ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), రాత్రి 7 గంటలకు
మార్చి 4న తొలి సెమీఫైనల్.. మార్చి 5న రెండో సెమీఫైనల్.. మార్చి 8 న ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకుంటుంది.