భోపాల్: రోడ్డుపైకి వచ్చిన నీలి దుప్పిని కారు ఢీకొట్టింది. కారు ముందు అద్దం పగులడంతో దుప్పి కాళ్లు లోపలకు చొచ్చుకొచ్చాయి. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి తలకు బలంగా తగలడంతో ఆ పాప మరణించింది. కారులో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. (Nilgai Crashes Into Car) మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గునాలో నివసించే సోను జాట్ తన భార్య, నాలుగేళ్ల కుమార్తె తాన్యతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పూర్వీకుల గ్రామమైన మగ్రాడాకు కారులో బయలుదేరాడు.
కాగా, జనవరి 14న సాయంత్రం 6.45 గంటల సమయంలో గునా బైపాస్‌లోని దో ఖంభా ప్రాంతంలో ఆ కారు వేగంగా వెళ్తున్నది. బిలోనియా గ్రామం సమీపంలో రెండు నీలి దుప్పిలు అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చాయి. సోను స్పందించేలోపు ఒక దుప్పిని కారు ఢీకొట్టింది. కారు ముందున్న అద్దంలోకి దాని కాళ్లు చొచ్చుకొచ్చాయి.
మరోవైపు కారు ముందు సీటులో తల్లి ఒడిలో ఉన్న నాలుగేళ్ల చిన్నారి తాన్య తలకు దుప్పి కాళ్లు బలంగా తగిలాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది. గాయపడిన సోను, అతడి భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు ముందు అద్దంలో చిక్కుకున్న నీలి దుప్పిని అతి కష్టంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన దానికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ దుప్పి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:
Protests In Bengal | జార్ఖండ్‌లో వలస కార్మికుడు మృతి.. బెంగాల్లో భారీ నిరసన
ED office searched by Police | ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసులు రైడ్.. సీసీటీవీ ఫుటేజ్ సీజ్
Gauri Lankesh murder case | గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు.. ఇండిపెండెంట్‌గా గెలుపు
Watch: డ్యూటీ ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరణ.. తర్వాత ఏం జరిగిందంటే?