Kalki 2 | ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్‌పల్లిలో భారీ సెట్స్, సెట్లో అడుగుపెట్టిన అమితాబ్
Kalki 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడునాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘Kalki 2898 AD’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. పురాణాల నేపథ్యాన్ని ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్‌తో మేళవించి విజువల్ గ్రాండియర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
Kalki 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడునాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘Kalki 2898 AD’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. పురాణాల నేపథ్యాన్ని ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్‌తో మేళవించి విజువల్ గ్రాండియర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. దర్శకుడి ఊహాశక్తి, టెక్నికల్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ విజయంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ‘కల్కి 2’ చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
మొదటి భాగంలో అశ్వత్థామ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమితాబ్ బచ్చన్ కొత్త షెడ్యూల్ షూటింగ్లో పాల్గొన్నారు. మహాభారత కాలం నుంచి చిరంజీవిగా, శాపగ్రస్తుడైన యోధుడిగా ఆయన పోషించిన అశ్వత్థామ పాత్ర కథకు వెన్నెముకలా నిలిచింది. విష్ణువు పదో అవతారమైన కల్కిని రక్షించే సంరక్షకుడిగా, ధర్మపక్ష యోధుడిగా అశ్వత్థామను చూపించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. నుదుటిపై మణి, వేల ఏళ్ల వేదనను మోస్తున్న భావోద్వేగాన్ని అమితాబ్ తన నటనతో ప్రభావవంతంగా ఆవిష్కరించారు. భైరవ (ప్రభాస్)తో జరిగిన సంఘర్షణ సన్నివేశాలు మొదటి భాగంలో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. సీక్వెల్లో అశ్వత్థామ ట్రాక్ మరింత యాక్షన్, ఎమోషనల్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
తాజా షెడ్యూల్లో కొద్ది రోజుల తర్వాత ప్రభాస్ సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన భైరవతో పాటు కర్ణుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించినకమల్ హాసన్ మార్చి తర్వాత షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగంలో సుమతి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణే సీక్వెల్లో ఉంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ‘కల్కి 2’ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా ‘కల్కి 2’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి సీక్వెల్ ఆ అంచనాలను అందుకుంటుందా? బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- amitabh
- Kalki
- kalki2
- kamal hassan
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

