హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తేతెలంగాణ): గ్రామీణ స్థాయిలో సాధికారత, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం నిరంతర కృషిచేసిన నాయకులను సతరించడానికి ఉద్దేశించిన సీ సుబ్రహ్మణ్యం కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డును 2025-26 ఏడాదికి సీడీఎస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యకు ప్రదానం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. భారతరత్న సీ సుబ్రహ్మణ్యం స్మారకార్థం ఈ పురసారాన్ని ప్రారంభించారు. మల్లేపల్లి లక్ష్మయ్య ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్తగానే కాకుండా దళిత, ఆదివాసీల సమస్యలపై దశాబ్దాలుగా పోరాడుతున్నారు. సీడీఎస్ చైర్మన్గా సామాజిక సమానత్వం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.