Skydive | సేవా కార్యక్రమం కోసం వృద్ధుడి సాహసం.. 91 ఏళ్ల వయస్సులో స్కై డైవింగ్
Skydive | వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 91 ఏళ్ల వృద్ధుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బ్రిటన్ (Britain) లోని సర్రీ కౌంటీ (Surry county) క్రేన్లీ (Kranely) గ్రామానికి చెందిన 91 ఏళ్ల వృద్ధుడు అలాన్ స్టిల్, సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించాలనే గొప్ప సంకల్పంతో స్కైడైవింగ్ (SKYdiving) చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
Skydive : వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 91 ఏళ్ల వృద్ధుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బ్రిటన్ (Britain) లోని సర్రీ కౌంటీ (Surry county) క్రేన్లీ (Kranely) గ్రామానికి చెందిన 91 ఏళ్ల వృద్ధుడు అలాన్ స్టిల్, సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించాలనే గొప్ప సంకల్పంతో స్కైడైవింగ్ (SKYdiving) చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సాహసం ద్వారా ఆయన సుమారు రూ.4.76 లక్షలకుపైగా విరాళాలను సేకరించారు.
ఈ మొత్తాన్ని ఆయన ‘రోలీస్ కమ్యూనిటీ సెంటర్’కు అందజేశారు. వయసు మళ్లినా ఆయన చూపిన సాహసం, సేవా దృక్పథంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా విమానం నుంచి స్కైడైవింగ్ చేసిన ఆ అద్భుత క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 91 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఘనత సాధించిన అలాన్ స్టిల్, అప్పుడే తన తదుపరి సాహసానికి సిద్ధమవుతున్నారు.
బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో గంటకు 160.9 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ‘జిప్ లైన్’ రైడ్‌ను పూర్తి చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- charity
- Old Man
- Skydive
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

