Vote | హత్నూర, జూలై 14 : ఒకే వ్యక్తికి 38 చోట్ల ఓటు అంటూ సోషల్మీడియాలో వైర ల్ అయిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూరలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. మహ్మద్ ఫక్రుద్ద్దీన్ తండ్రి ఇస్మాయిల్ పేరుతో పోలింగ్స్టేషన్ 226లో బీఎల్వోకి అందిన ఫారం బీఎల్వో లాగిన్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా, 38చోట్ల తండ్రి పేరు ఇస్మాయిల్రాగా.. ఫక్రుద్దీన్ పేరు మాత్రం ఆయాప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నట్టు వచ్చింది. కొం దరు సోషల్మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. మ్యాపిం గ్ సిస్టమ్ సజెషన్ ఆప్షన్లో పరిశీలించగా, ఎక్కడా ఇద్దరి పేర్లు మ్యాచింగ్ కాలేదని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని తహసీల్దార్ సూచించారు.