Free Coaching | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కేయూలో ఉచిత కోచింగ్..!
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షల కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనందున.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ గురించి స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను స్టడీ సెంటర్లో అందజేయాలని ఆయన సూచించారు. ఆగస్టు 7వ తేదీలోగా అప్లికేషన్ సమర్పించాలని, గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, కేటగిరీలకు చెందిన విద్యార్థులందరూ ఈ ఉచిత శిక్షణకు అర్హులని శ్రీనివాస్ వెల్లడించారు. విషయ పరిజ్ఞానం, అనుభవం ఉన్న నిపుణులైన అధ్యాపకులు పాఠాలు చెబుతారని ఆయన చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత కోచింగ్ క్యాంప్‌ను వినియోగించుకోవాలని పుల్లా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

