ఇంద్రవెల్లి : వ్యవసాయ పంటలకు నానో యూరియా ( Nano Fertilizers ) , నానో డీఏపీ( DAP ) ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగు తుందని వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ ( Rathod Ganesh ) తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పిప్రి గ్రామంలో రైతులకు నానో ఎరువుల వాడకం పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏవో గణేష్ మాట్లాడుతూ ప్రతి ఎకరాకు 45 కిలోల యూరియా బస్తా అవసరం ఉండగా, కేవలం 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్ తో పంటలకు అదే ఫలితం వస్తుందన్నారు. బస్తా యూరియా ధర రూ. 266 ఉండగా, నానో యూరియా బాటిల్ ధర రూ. 220 మాత్రమేనని, మోయడానికి, చల్లడానికి సులభంగా ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరేంగా సుంగుపటేల్, కోరమాండల్ మార్కెటింగ్ ఆఫీసర్ నాగరాజ్, ఏఈవో సైజం, మార్కెటింగ్ డెవలప్మెంట్ ట్రెడేటరీ శ్రీహరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.