Arrest and Remand | బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్
Arrest and Remand | కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటల తో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
కుభీర్ : కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటల తో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి ( Assault Case ) పాల్పడిన ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ( CI Praveen Kumar ), కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపారు.
మంగళవారం సాయంత్రం బాలిక, ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి, ఆమె వాంగ్మూలాన్ని చట్ట ప్రకారం నమోదు చేశామన్నారు. భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడు జాదవ్ బిక్కును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

