సంగారెడ్డి : జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ( Vinayaka immersion ) సందర్భంగా చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. పటానుచెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలోని నేరెడ్ చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం శిరీష చారిటబుల్ ట్రస్టుకు చెందిన విద్యార్థులు సాయంత్రం వినాయకుడిని విసర్జించటానికి సమీపంలోని నేరెడ్ చెరువుకు ఊరేగింపుగా వెళ్లారు. విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ఆరుగురు నీటమునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబాలు చెరువు ప్రాంతానికి చేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చెరువులో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.