కరకగూడెం, ఆగస్టు 01 : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను కరకగూడెం మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఖానపూర్ మండలం బుధరావుపేటకు చెందిన నలుగురు వ్యక్తులు కరకగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో 11 పశువులను కోనుగోలు చేసి రెండు వాహనాల్లో తరలిస్తుండగా తెల్లవారుజామున ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు సదరు వ్యక్తులను పట్టుకుని విచారణ చేసి ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అనంతరం పశువులను పాల్వంచ పట్టణంలోని గోశాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.