హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థను బలోపేతం చేయాలని, కార్మికుల హకులు, సంక్షేమాన్ని కాపాడాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. సింగరేణి కార్మికులకు ఈ ఏడాది చెల్లించబోయే బోనస్‌ను వాస్తవ నికర లాభాల ఆధారంగా నిర్ణయించాలని, కార్మికుల లాభాల వాటాను 36 శాతానికి పైగా పెంచాలని కోరారు. సింగరేణిలో వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని పేర్కొన్నారు.
బోనస్‌లో కోత ఎందుకు?
సింగరేణి కార్మికులు తమ శ్రమతో సంస్థకు రూ.వేల కోట్ల లాభాలు తీసుకొస్తున్నా వారికి న్యాయంగా దకాల్సిన లాభాల వాటా అందడం లేదని కేటీఆర్ విమర్శించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు కాగా, అందులో 33 శాతం వాటా రూ.1,551 కోట్లు అయితే కార్మికులకు రూ.796 కోట్లే చెల్లించారని పేరొన్నారు. 2024- 25లో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినా రూ.819 కోట్ల వాటానే చెల్లించారని తెలిపారు. లాభాల లెకింపులో ప్రాజెక్టుల విస్తరణ తదితర కారణాలతో మొత్తాలను పకనపెట్టి, మిగిలిన మొత్తాన్ని ఆధారంగా చేసుకుని బోనస్ చెల్లించే విధానాన్ని కార్మికులు అంగీకరించబోరని స్పష్టంచేశారు.
రూ.2,342 కోట్ల బకాయిలు చెల్లించాలి
2023 నుంచి 2025 వరకు సింగరేణి లాభాల బోనస్‌కు సంబంధించి కార్మికులకు రూ.2,342 కోట్ల బకాయిలు ఉన్నాయని కేటీఆర్ పేరొన్నారు. కార్మికుల కష్టార్జితానికి సంబంధించిన ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంతో పోలిస్తే బోనస్ విషయంలో కార్మికులకు న్యాయం జరుగడం లేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల పెర్స్పై ఆదాయపు పన్ను సమస్యను కూడా ప్రస్తావించారు. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెర్స్ ఆదాయపు పన్నును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని గుర్తుచేశారు. 2023 ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికుల పెర్స్పై ఆదాయపు పన్నును కంపెనీ భరించేలా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతున్నా ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు పెర్స్పై ఆదాయపు పన్నును కార్మికులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయిలా?
సింగరేణి సంస్థకు ట్రాన్స్‌కో, జెన్కో నుంచి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. ఈ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నదని వాపోయారు. జీతాల చెల్లింపుల కోసం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వస్తే సంస్థ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికుల రక్షణ పరికరాలు, యంత్రాలు, విడిభాగాలు, వైద్య సేవలు, రోజువారీ కార్యకలాపాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు. సింగరేణికి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
‘మారు పేర్ల’ సమస్య పరిషరించాలి
సింగరేణిలో ‘మారు పేర్ల’ సమస్య పరిషరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికీ సమస్య పరిషారం కాలేదని పేర్కొన్నారు. మారు పేర్ల బాధితులకు అవకాశం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మిక వ్యతిరేక సర్యులర్లు జారీ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. డిస్మిస్ అయిన కార్మికులకు అవకాశం కల్పిస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హామీ అమలు కాకపోగా వందలాది మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేస్తున్నదని మండిపడ్డారు. డిస్మిస్ కార్మికుల సమస్యను వెంటనే పరిషరించి వారికి మరో అవకాశం కల్పించాలని కోరారు.
నెలకోసారి మెడికల్ బోర్డులు
సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియపైనా కేటీఆర్ నిలదీశారు. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మెడికల్ బోర్డు కోసం 2,500 మందికిపైగా కార్మికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మెడికల్ బోర్డులు నిర్వహించి అన్‌ఫిట్ కార్మికుల కుటుంబసభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రెండుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించామని, దాదాపు 16 వేల మందికిపైగా వారసత్వ ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రతి కార్మికుడికీ 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందించేలా సొంతింటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ప్రజల ఆస్తి
సింగరేణి సంస్థలో తన వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని కేటీఆర్ పేరొన్నారు. సంస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటాలను విక్రయించాలనే ఆలోచన ఎందుకని ప్రశ్నించారు. సింగరేణి కేవలం ఒక సంస్థ కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అని స్పష్టంచేశారు. వేలాది మంది కార్మికులకు జీవనాధారమైన సంస్థను బలహీనపరిచే ఏ చర్యనైనా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు. సింగరేణి వాటాల విక్రయ ఆలోచనను విరమించుకొని సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్మికులకు బోనస్‌ను గణనీయంగా పెంచిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని పేరొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు పెద్ద ఎత్తున బోనస్ చెల్లించామని తెలిపారు. ఈ ఏడాది బోనస్‌ను వాస్తవ నికర లాభాల ఆధారంగా నిర్ణయించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు అండగా ఉంటం
సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. కార్మికుల హకులను కాపాడటంతోపాటు సంస్థ భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హకుల సాధన, సింగరేణి భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
ప్రజలే బీఆర్ఎస్ బలం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు ప్రజలే బలమని, తెలంగాణ ప్రజల హకులు, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేస్తూ, ప్రజలకు అండగా నిలువాలని సూచించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ సీనియర్ ఆదివాసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంగళవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరినవారిలో యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు, కొత్తగూడ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచులు, సీనియర్ ఆదివాసీ నాయకులున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జాన్సన్‌నాయక్‌తో కలిసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పార్టీలో చేరిన నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేటీఆర్ ఏడు ప్రధాన డిమాండ్లు
1. సింగరేణి వాస్తవ లాభాలపై కార్మికులకు 36 శాతానికి పైగా లాభాల వాటా చెల్లించాలి.
2. మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న 2,500 మందికి పైగా కార్మికులకు ప్రతినెలా మెడికల్ బోర్డులు నిర్వహించి, అన్‌ఫిట్ అయిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి.
3. ఎన్నికల హామీ మేరకు పెర్స్పై ఆదాయపు పన్నును కార్మికులకు తిరిగి చెల్లించాలి.
4. సొంతింటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి.
5. మారుపేర్ల సమస్యను పరిషరించి, డిస్మిస్ అయి న కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
6. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డట్టు పేరొన్న రూ.60 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.
7. సింగరేణి సంస్థలో వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి.