KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
AI Can Write the Code | కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో ఇంజినీర్లకు అందుబాటులోకి రానున్న కొత్త ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలను వివరిస్తూ రూపొందించిన ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్: హూ గెట్స్ ఇట్ ఇంటు ప్రొడక్షన్?’ పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో ఇంజినీర్లకు అందుబాటులోకి రానున్న కొత్త ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలను వివరిస్తూ రూపొందించిన ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్: హూ గెట్స్ ఇట్ ఇంటు ప్రొడక్షన్?’ పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నగరానికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, సీ3ఆప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు చెన్నకేశవులు కుమ్మరి ఈ పుస్తకాన్ని రచించారు. ఏఐ సాధనాలు క్షణాల్లో సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతున్న పరిస్థితుల్లో ఇంజినీర్ల అసలైన బాధ్యత ఏమిటనే అంశానికి ఈ పుస్తకం స్పష్టమైన సమాధానం ఇస్తుంది. కేవలం కోడ్ రాయడం కంటే, ఏఐ వ్యవస్థలను వాస్తవ వ్యాపార అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, సంస్థల డేటాతో అనుసంధానించడం, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ తక్కువ వ్యయంతో సమర్థంగా పనిచేసేలా వినియోగంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని రచయిత ఇందులో వివరించారు.
ఈ క్రమంలో కొత్తగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న ‘ఏఐ ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్’ (ఎఫ్‌డీఈ) ఉద్యోగ పాత్రను ఈ పుస్తకం పరిచయం చేస్తోంది. వ్యాపార సంస్థలతో నేరుగా పనిచేస్తూ వాటి అవసరాలకు తగ్గట్టుగా ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసి, సురక్షితంగా అమలయ్యే వరకు బాధ్యత వహించే ఇంజినీర్లకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయని పేర్కొంది. మొత్తం 24 అధ్యాయాలుగా సాగే ఈ పుస్తకంలో ఏఐ రిట్రీవల్ సిస్టమ్స్, ఏఐ ఏజెంట్లు, భద్రత, డిప్లాయ్‌మెంట్, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలను భారతీయ పరిశ్రమల ఉదాహరణలతో విశ్లేషించారు. సాఫ్ట్వేర్, క్లౌడ్, డెవాప్స్ ఇంజినీర్లతో పాటు ఏఐ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు, ఫ్రెషర్లు, సాంకేతిక సంస్థల నాయకులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. తన పుస్తకాన్ని ఆవిష్కరించి యువ ఇంజినీర్లను ప్రోత్సహించిన కేటీఆర్‌కు చెన్నకేశవులు కుమ్మరి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు కేశవ్ రచించిన రెండో పుస్తకం ‘యూజ్ ఏఐ, స్టే రిలెవెంట్: హౌ టు థింక్, వర్క్, అండ్ థ్రైవ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కూడా త్వరలోనే విడుదల కానుంది. కేవలం ఇంజినీర్లకే పరిమితం కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు సహా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సులభమైన భాషలో దీనిని రూపొందించారు. భారతీయ కార్యాలయాల అనుభవాలు, సిద్ధంగా ఉపయోగించుకోగల ప్రాంప్ట్‌లు, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రోజువారీ పనుల్లో ఏఐని ఎలా సమర్థంగా వినియోగించుకోవాలో ఈ రెండో పుస్తకం వివరిస్తుంది. ఈ రెండు పుస్తకాలు పేపర్‌బ్యాక్, కిండిల్ రూపాల్లో అందుబాటులోకి రానున్నాయని, మరిన్ని వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో @kesavkummari ఖాతా ద్వారా సంప్రదించవచ్చని రచయిత వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
AP News | పరిషత్ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది : చంద్రబాబు
Health Tips | అబ్బే.. థూ.. అంటూ చీకొట్టకండి.. రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట..!
Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

