న్యూఢిల్లీ : ఓ బ్రెజిల్ జంట తమ ప్రేమను గిన్నిస్ రికార్డ్ సాధనకు వేదికగా మలచుకొంది. రెనటో అల్వెస్, అతడి ప్రియురాలు నైరా రాబెర్టా 30 సెకండ్లలో 195 ముద్దులు పెట్టుకొని అర నిమిషంలో అత్యధిక ముద్దులు పెట్టుకొన్న జంటగా నిలిచింది. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం జరుపుకొనే జూలై 6 తర్వాత కొంత కాలానికే ఈ ఘనతను ఈ జంట సాధించింది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ జంట’గా తమను నమ్ముతూ, తమది దృఢమైన బంధంగా భావించిన వీరిద్దరూ ఈ ప్రయత్నాన్ని సవాల్‌గా తీసుకొన్నారు. ఒక నిమిషంలో ఎక్కువ ముద్దులు పెట్టుకొన్న జంటగా నిలవడంపై ఈ జంట ఇప్పుడు దృష్టి సారించింది.
‘నేను ఎముక మజ్జ దాతను. శ్రద్ధ లోపం, హైపర్ యాక్టివ్ అసమతుల్యత(ఏడీహెచ్‌డీ)తో బాధ పడుతున్నాను. ఏడీహెచ్‌డీ వ్యక్తులు వాళ్లు చేయాలనుకొన్నవాటిని చేయగల సామర్థ్యం కలిగి ఉంటారని నేను నిరూపించాలనుకొంటున్నాను’ అని రెనటో అన్నారు. రెనటో(32)కు రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. గతంలో పలు గిన్నిస్ రికార్డులు అతడి పేరిట నమోదయ్యాయి. గెలువడానికి తాను బానిసనని అభివర్ణించుకొన్న రెనటో అత్యధిక ప్రపంచ రికార్డులు కలిగిన బ్రెజిలియన్ తానేనని నమ్మతున్నారు.