భువనేశ్వర్: కొందరు దొంగలు థార్ వాహనంలో ఏటీఎం సెంటర్‌కు చేరుకున్నాడు. అందులోని ఏటీఎం మెషిన్‌కు తాడు కట్టి థార్‌తో రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. పగిలిన ఏటీఎంలోని డబ్బు దోచుకుని పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Thar Pulls Out ATM With Rope) ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్దకు ఐదురుగు వ్యక్తులు థార్‌లో చేరుకున్నారు. ఏటీఎం మెషిన్‌కు తాడు కట్టి థార్ వాహనంతో లాగడంతో అది ఊడి వచ్చింది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకెళ్లి ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టారు. అందులో ఉన్న డబ్బు దోచుకుని ఆ వాహనంలో పారిపోయారు. అయితే ఆ ఏటీఎంలో ఎంత డబ్బు ఉన్నది అన్నది తెలియలేదు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ధ్వంసమైన ఏటీఎం భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోని డబ్బు చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థార్ వాహనం నంబర్, నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The crime portfolio of Thar is expanding. This is from Baleshwar in Odisha. pic.twitter.com/mHK6YueYvn
— Piyush Rai (@Benarasiyaa) July 11, 2026