హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కీలక ఖనిజ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయాలని నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం నీతి ఆయోగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ డీకే సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత, అన్వేషణ, అందుకు గల అవకాశాలు, వివిధ ప్రభుత్వ మైనింగ్ సంస్థలు తీసుకోవాల్సిన చొరవ, బాధ్యతలపై చర్చించారు. కమిటీ మెంబర్ సెక్రటరీ, నీతి ఆయోగ్ డిప్యూటీ ఐడ్వెజర్ మినరల్స్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి పాల్గొన్నారు.