హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్‌కు మంగళవారం వరకు 17,387 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ -1కు 1,922, పేపర్ -2కు 12,591, రెండు పేపర్లు రాసేందుకు 2,874 చొప్పున దరఖాస్తులొచ్చాయి.
దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. అయితే దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పించారు. https:// schooledu. telangana.gov.in. వెబ్‌సైట్‌ను సంప్రదించి ఈ నెల 30లోపు ఎడిట్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.