‘డ్రాగన్’ చిత్రంతో యువతరానికి దగ్గరైంది అస్సామీ సొగసరి కయాదు లోహర్. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఆమె ఆకట్టుకుంటున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని తన పాత్ర, దర్శకుడి పనితీరుపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘కథ చెప్పే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘నా వర్కింగ్ ైస్టెల్ విభిన్నంగా ఉంటుంది.
సినిమా విషయంలో నేను కాస్త ‘మ్యాడ్’గా ఉంటాను. నా ైస్టెల్కు సిద్ధంగా ఉంటేనే ముందుకు రండి’ అంటూ సున్నితంగా హెచ్చరించారు. సినిమా షూటింగ్లో దర్శకుడు పనితీరు ఏమిటో తెలిసింది. ‘మ్యాడ్’ అనే మాటకు అసలైన అర్థం తెలుసుకున్నా. అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీవ్రంగా శ్రమిస్తాడాయన. ఈ సినిమాలో చేసిన పాత్ర పట్ల సంతోషంగా ఉన్నా’ అని కయాదు లోహర్ ఆనందం వ్యక్తం చేసింది.