గద్వాల అర్బన్, జూలై 28 : అధ్యాపకురాలు మందలించిందని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన తరుణ్ (18) గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టీయర్‌లో 440 మార్కులకు 434 సాధించగా మరో విద్యార్థి 435 మార్కులు సాధించాడు. మార్కుల విషయంలో వారిమధ్య జరిగిన గొడవ లెక్చరర్ వద్దకు చేరడంతో ఆమె తరుణ్‌ను చెంపమీదకొట్టి ‘నువ్వు మంత్రి కొడుకువా’ అని విద్యార్థుల ముందు అవమానించింది.దీంతో మనస్తాపానికి గురైన తరుణ్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకుగల కారణాలను సూసైట్ నోట్లో రాశాడని తెలిసింది.