Oyo Case | ఇటీవల మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన యువతి షారన్ నిఖిత టోప్నో (23) ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లో ఉన్న ఓయో హోటల్ రూమ్ నం.303లో అనుమానాస్పదంగా మృతి చెందింది. హోటల్ గదిని పరిశీలించిన పోలీసులు అక్కడి గోడలు, బెడ్ షీట్ పై రక్తపు మరకలను గుర్తించి నిందితుడు శ్రీనివాస రవితేజ కోసం గాలిస్తున్నాయి.
కాగా యువతి మృతి కేసులో పరారీలో ఉన్న ప్రియుడు రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవితేజ ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్లోర్ క్లీనింగ్ లక్విడ్ తాగిన రవితేజను వెంటనే కుటుంబసభ్యులు అతడిని విశాఖ KGHకు తరలించారు. ప్రస్తుతం రవితేజ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
వెలుగులోకి కీలక విషయాలు..
యువతి మృతి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్ పగిలినట్లు గుర్తించిన పోలీసులు బెడ్‌తోపాటు రూమ్ గోడలపై రక్తపు మరకలను గుర్తించారు. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు.
అర్ధరాత్రి యువతి స్పృహ కోల్పోయిందంటూ రవితేజ తన వద్దకు వచ్చాడని హోటల్ సూపర్వైజర్ తెలిపాడు. అంబులెన్స్‌లో తీసుకెళ్దామంటే.. వద్దు, బైక్ చాలని నిఖితను ఆసుపత్రికి తీసుకెళ్లిన రవితేజ అనంతరం నిఖిత మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో, అక్కడి నుంచి పరారయ్యాడు. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు వ్యత్యాసం.. అబ్బాయి కంటే అమ్మాయే పెద్దదని పోలీసులు గుర్తించారు.
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!