BRS Leaders Arrests | కరెంటు కోతలపై నిలదీస్తే అరెస్టులా? : బీఆర్ఎస్ నేతల మండిపాటు
BRS Leaders Arrests | కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాదేవపూర్ : కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు (Arrests ) చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పవర్ ప్లాంట్ల ( Power Plants ) ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా మహాదేవపూర్ మండల నాయకులు శ్రీపతిబాపు, కేదారి గీత, అలీం ఖాన్, కూరతోట శ్రీహరి, చిల్ల కుమార్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడమే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రస్తు తం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, బొగ్గు నిల్వలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు కుంటి సాకులేనని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

