ముంబై: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం (AIMIM Big Win) మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటింది. కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో 125 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా తన ఉనికిని చాటుకున్నది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించారు.
కాగా, జనవరి 3 నుంచి 13 వరకు ఇద్దరు సోదరులు కలిసి ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, నాగ్పూర్, ముంబై అంతటా 12కు పైగా బహిరంగ సభల్లో ప్రసంగించారు. వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్లలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలను అసదుద్దీన్ ఒవైసీ బలంగా లేవనెత్తారు. మౌలిక సదుపాయాలు, తాగు నీరు, పారిశుధ్యం, పౌర సేవా లోపాలను ఎత్తిచూపారు. ఈ సమస్యల పరిష్కారంపై ఓటర్లకు హామీ ఇచ్చారు.
మరోవైపు చిన్న కమ్యూనిటీ ర్యాలీలతో పాటు పాద యాత్ర ద్వారా స్థానికులకు అసదుద్దీన్ ఒవైసీ చేరువయ్యారు. తన ప్రసంగాల్లో రాజకీయాల్లో మహిళల పాత్ర గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇస్లాంలో మహిళల శక్తిని చాటేందుకు మతపరమైన కొటేషన్లను ప్రస్తావించారు. బీహార్లో మహిళా ఓటర్లు పార్టీని ఎలా గెలిపించారో అన్నది ఉదాహరించారు. కాంగ్రెస్, శివసేన, ఇతర పార్టీల దొంగ హామీలను నిలదీశారు. అలాగే మహారాష్ట్రలోని పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి వారిని సమన్వయం చేశారు.
Also Read:
ED office searched by Police | ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసులు రైడ్.. సీసీటీవీ ఫుటేజ్ సీజ్
Russian Man Kills Two Women | గోవాలో రష్యా వ్యక్తి దారుణం.. ప్రియురాలు, స్నేహితురాలిని హత్య
Nilgai Crashes Into Car | కారులోకి దూసుకొచ్చిన దుప్పి.. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి మృతి