పనాజీ: రష్యా వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు, మహిళా స్నేహితురాలిని హత్య చేశాడు. వారిద్దరిని గొంతు కోసి చంపాడు. ఆ రష్యా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర గోవాలో ఈ సంఘటన జరిగింది. (Russian Man Kills Two Women) రష్యా జాతీయుడైన 37 ఏళ్ల అలెక్సీ లియోనోవ్, జనవరి 14న రాత్రి వేళ మోర్జిమ్లోని అద్దె ఇంట్లో ఉంటున్న స్నేహితురాలైన 37 ఏళ్ల ఎలెనా వనీవాపై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతుకోసి హత్య చేశాడు.
కాగా, ఆ తర్వాత 8 కిలోమీటర్ల దూరంలోని అరమ్బోల్ గ్రామానికి అలెక్సీ లియోనోవ్ చేరుకున్నాడు. జనవరి 15న సాయంత్రం వేళ అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న ప్రియురాలైన 37 ఏళ్ల ఎలెనా కస్థానోవా, అతడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గదిలో బంధించాడు. తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
మరోవైపు ఆ ఇంటి యజమాని ఫిర్యాదుతో మండ్రేమ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రష్యా జాతీయుడైన అలెక్సీ లియోనోవ్ను అరెస్ట్ చేశారు. రష్యాకు చెందిన ప్రియురాలితో పాటు స్నేహితురాలిని కూడా అతడు హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రష్యా వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Nilgai Crashes Into Car | కారులోకి దూసుకొచ్చిన దుప్పి.. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి మృతి
103 Year Old Woman | చనిపోయిందని వృద్ధురాలి అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అంతలోనే బతికిన బామ్మ!!
Watch: పురుషుల వేషం వేసి.. ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళలు