Flight Tickets | విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అదనపు చార్జీలుండవ్!
Flight Tickets | ఇకపై విమాన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పు చేసుకోవచ్చు. అయితే పలు షరతులు వర్తిస్తాయి. ఈ మేరకు డీజీసీఏ టికెట్ రిఫండ్ నిబంధనలను సవరించింది.
Flight Tickets | న్యూఢిల్లీ : ఇకపై విమాన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పు చేసుకోవచ్చు. అయితే పలు షరతులు వర్తిస్తాయి. ఈ మేరకు డీజీసీఏ టికెట్ రిఫండ్ నిబంధనలను సవరించింది. టికెట్‌బుక్ చేసుకున్న తర్వాత 48 గంటలపాటు విమానయాన సంస్థలు ‘లుక్ ఇన్ ఆప్షన్’ను ఇవ్వాలి. ఈ గడువులో ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. లేదా మార్పు చేసుకోవచ్చు. అయితే ఎంచుకున్న కొత్త తేదీలో టికెట్ ధరలో మార్పులు ఉంటే, ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజులు ఉండగా బుక్ చేసుకున్న టికెట్‌కు ఈ లుక్ ఇన్ ఆప్షన్ వర్తించదు.
అలాగే అంతర్జాతీయ విమానాలకు ప్రయాణ తేదీ 14 రోజులు ఉండగా బుక్ చేసుకున్న టికెట్‌కు కూడా ఈ సౌలభ్యం వర్తించదు. ట్రావెల్ ఏజెంట్ లేదా వారి పోర్టల్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే రిఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదే. 14 రోజుల్లోగా రిఫండ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విమానాయాన సంస్థ అధికారిక వైబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారు 24 గంటల్లోపు తమ పేరులో మార్పులు ఉంటే చేయమని కోరవచ్చు. వారి నుంచి అదనపు చార్జీ వసూలు చేయరాదు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టికెట్ రద్దు చేసే నిబంధనల్లోనూ డీజీసీఏ సవరణలు చేసింది. ప్రయాణికుడు లేదా అదే పీఎన్ఆర్ నంబర్ ఉన్న టికెట్లో పేరు ఉండే కుటుంబసభ్యులు ప్రయాణ తేదీ నాడు దవాఖానలో చేరినట్టయితే రిఫండ్ లేదా క్రెడిట్ షెల్ ఆప్షన్‌ను కోరవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

