Congress Guarantees | గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం
Congress Guarantees | ఐదు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ఐదు గ్యారెంటీల అమలు కష్టతరంగా మారిందంటూ సీఎం సిద్ధరామయ్య మొదలు మంత్రుల వరకూ వీలు దొరికినప్పుడల్లా మీడియా ముందు మొర పెట్టుకోవడం నిత్యకృత్యమైంది.
Congress Guarantees | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఐదు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ఐదు గ్యారెంటీల అమలు కష్టతరంగా మారిందంటూ సీఎం సిద్ధరామయ్య మొదలు మంత్రుల వరకూ వీలు దొరికినప్పుడల్లా మీడియా ముందు మొర పెట్టుకోవడం నిత్యకృత్యమైంది. ఇప్పుడు ఆ జాబితాలోకి రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా చేరిపోయారు. ‘ఐదు గ్యారెంటీల అమలు రాష్ట్ర ఖజానాపై పెను భారం మోపుతున్నది’ అంటూ గురువారం ఆయన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎంత కష్టమొచ్చినా.. హామీల అమలును కొనసాగిస్తామన్నారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ.. మరణించిన వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వాటిని నిలిపివేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీంతో డీకే వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
స్కీమ్స్ను ఎత్తేయడానికే..
గ్యారెంటీలను ఎత్తివేయడానికి లేదా లబ్ధిదారుల్లో కోత విధించడానికి డీకే శివకుమార్ ఖజానాపై భారమవుతున్నదంటూ సాకులు చెప్తున్నారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు విరుచుకుపడ్డారు. గ్యారెంటీల నెపంతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టును కూడా సర్కారు చేపట్టలేదని మండిపడ్డారు. సర్వత్రా విమర్శలు పెరుగుతుండటంతో సీఎం సిద్ధరామయ్య సహా మంత్రులు స్పందించారు. డీకే వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఖజానాపై భారం పడుతున్న మాట వాస్తవమైనప్పటికీ, గ్యారెంటీలను కొనసాగిస్తామని హామీనిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

