రామగిరి, ఫిబ్రవరి 24 : నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 -20, 2020- 21 బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫీజు ఆలస్య రుసుము లేకుండా మార్చి 16వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుముతో మార్చి 17 వరకు చెల్లించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు లేదా సంబంధిత కళాశాలలను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.