డోసు పెంచు గురూ!
మారిన కాలంతో పాటు గుండె సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మారిన కాలంతో పాటు గుండె సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని భారీగా తగ్గించుకోవాలంటే ప్రస్తుత మార్గదర్శకాల కంటే 3 నుంచి 4 రెట్లు ఎకువ వ్యాయామం అవసరమని కొత్త అధ్యయనం చెబుతుంది.
సాధారణంగా వారానికి 150 నిమిషాల వ్యాయామం సరిపోతుందని నిపుణులు చెబుతారు. కానీ, గుండె ఆరోగ్యానికి వారానికి 560 నుంచి 610 నిమిషాల వరకు వ్యాయామం అవసరమని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన ఓ పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన ప్రకారం.. వారానికి 150 నిమిషాల వ్యాయామం చేసేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కేవలం 8% నుంచి 9% మాత్రమే తగ్గింది. గుండె జబ్బుల ప్రమాదాన్ని 30% కంటే ఎకువ తగ్గించుకోవాలంటే వారానికి కనీసం 560 నుంచి 610 నిమిషాల తీవ్రమైన వ్యాయామం (వేగంగా నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ మొదలైనవి) అవసరం.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో కేవలం 12% మంది మాత్రమే ఈ స్థాయిని చేరుకోగలిగారు. అందరికీ ఒకే రకమైన వ్యాయామ ప్రణాళిక సరిపోదని, వ్యాయామ లక్ష్యాల్ని వ్యక్తి కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ ఆధారంగా నిర్ణయించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తకువ ఫిట్నెస్ ఉన్నవారు 20% గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి వారానికి 370 నిమిషాలు వ్యాయామం చేయాల్సి వస్తే, మంచి ఫిట్నెస్ ఉన్నవారు 340 నిమిషాలు చేస్తే సరిపోతుందట. అంటే, తకువ ఫిట్నెస్ ఉన్నవారు వారానికి మరో 30 నుంచి 50 నిమిషాలు అదనంగా శ్రమించాల్సి ఉంటుంది.
ఒకేసారి వారానికి 600 నిమిషాల వ్యాయామం చేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం వారానికి 150 నిమిషాలు చేస్తున్నట్లయితే, దాన్ని నెమ్మదిగా రోజురోజుకూ 10-15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్లడం మంచిది. ఎకువ వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గిందని కచ్చితంగా నిర్ధారించకున్నా, కానీ రెండిటి మధ్య బలమైన సంబంధం ఉందని మాత్రం తేల్చిచెబుతున్నారు పరిశోధకులు. వేగంగా నడవడం, సాధారణ సైక్లింగ్, తోటపని, రన్నింగ్, ఈత కొట్టడం, ఏరోబిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ లాంటి క్రీడలు ఆడటం, ఆఫీసులో లిప్ట్కు బదులు మెట్లు వాడటం, రోజూ నడిచే అలవాటు చేసుకోవడం, సుదీర్ఘ సమయం ఒకే చోట కూర్చోకుండా మధ్యలో విరామం తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

