Couple Friendly | ‘కపుల్ ఫ్రెండ్లీ’ 10 రోజుల్లో ₹12.67 కోట్ల గ్రాస్.. ప్రశంసలతో పాటు వసూళ్ల వర్షం
Couple Friendly | యువ ప్రేక్షకులను అలరించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్లీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి జంటగా, దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
Couple Friendly | యువ ప్రేక్షకులను అలరించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్లీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి జంటగా, దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్ర యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. తనకు సినిమా ఎంతో నచ్చిందని ప్రభాస్ వెల్లడించడంతో, మూవీకి అదనపు హైప్ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకెళ్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ స్థాయి కలెక్షన్లు యూత్ ఫుల్, కంటెంట్ డ్రివెన్ చిత్రానికి చాలా మంచి నెంబర్స్‌గా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొదటి వారం మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, రెండో వారంలో కూడా స్థిరమైన వసూళ్లతో రన్ అవుతోంది. ముఖ్యంగా యువత, కపుల్స్ నుంచి మంచి స్పందన రావడం మూవీకి ప్లస్ అయ్యింది.
ఈ చిత్రానికి సంగీతాన్ని ఆదిత్య రవీంద్రన్ అందించగా, పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఫీల్ తీసుకొచ్చాయి. నిర్మాణ బాధ్యతలను యూవీ క్రియేషన్స్ నిర్వహించింది. వారి ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ, స్నేహం, రిలేషన్షిప్లలోని సున్నితమైన భావోద్వేగాలను సరదాగా, సహజంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంతోష్ శోభన్ నటన, మానస వారణాసి స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. మొత్తంగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్‌గా కూడా సక్సెస్ సాధిస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వచ్చే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని మంచి నెంబర్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

