బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ.. గుండెపోటుతో రైతు మృతి
బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జంగపల్లికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (55) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
- గుండ్లపల్లి ఎస్బీఐలో ఘటన
గన్నేరువరం, ఆగస్టు 6 : బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జంగపల్లికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (55) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. డబ్బులు అవసరం కావడంతో గురువారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్బీఐకి వెళ్లాడు.
డబ్బులు డ్రా చేసుకునేందుకు లైన్లో నిల్చోగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్థానికులు గమనించి దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతిచెందాడు. కండ్ల ముందే రైతు కుప్పకూలి మృతి చెందడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో జంగపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య కనకవ్వ ఉన్నది, పిల్లలు లేరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

