అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం పల్లి(బీ) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ (48) తనకున్న ఐదెకరాల భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.
తలమడుగు, ఆగస్టు 6 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం పల్లి(బీ) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ (48) తనకున్న ఐదెకరాల భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖర్చులు పెరగడం, ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాడు.
అతనికి సీతగొంది దకన్ గ్రామీణ బ్యాంకులో సుమారు రూ.3 లక్షల పంట రుణం ఉండగా, అదనంగా సుమారు రూ.6 లక్షల ప్రైవేట్ అప్పులు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నెల 4వ తేదీన సాయంత్రం పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

